AP Inter Results 2026: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ మరియు డైరెక్ట్ లింక్ వివరాలు!

AP Inter Results 2026 date: మీ మొబైల్‌లో వాట్సాప్ మరియు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మార్కులు చూసుకోండి!

    తమ్ముళ్లు, చెల్లెమ్మలు.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్లందరికీ ఒక ముఖ్యమైన విషయం! పరీక్షలు అయితే రాసేశారు కానీ, ఇప్పుడు అందరి టెన్షన్ అంతా “రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా” అని కదా. దాని గురించి ఒక చిన్న అప్డేట్.

రిజల్ట్స్ ఎప్పుడు రావొచ్చు?

మన ఏపీ ఇంటర్ బోర్డు వారు చెప్పిన దాని ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పేపర్లు దిద్దే పని (వాల్యుయేషన్) జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరు కల్లా అన్నీ పూర్తి చేసి, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మీకు మార్కులు చెప్పేస్తారు.

రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి?

రిజల్ట్స్ రాగానే మీరు కంగారు పడకుండా ఉండాలంటే ఈ రెండు పద్ధతులు గుర్తుంచుకోండి:

  1. వెబ్‌సైట్ ద్వారా:

    • ముందుగా ఫోన్‌లో గానీ, నెట్ సెంటర్‌లో గానీ https://bieap-gov.org/index.html అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

    • అక్కడ “Inter Results 2026” అని కనిపిస్తుంది, దాని మీద నొక్కండి.

    • మీ హాల్ టికెట్ నంబర్ (Roll Number), మీ పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేసి ‘Submit’ కొడితే చాలు. మీ మార్కుల లిస్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఒక ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి.

  2. వాట్సాప్ ద్వారా (ఇది ఇంకా ఈజీ!):

    • మీ ఫోన్‌లో +91 95523 00009 అనే నెంబర్ సేవ్ చేసుకోండి.

    • వాట్సాప్‌లో ఆ నెంబర్‌కి ‘Hi’ అని మెసేజ్ పంపండి.

    • అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘విద్యా సేవలు’ ఎంచుకుని, ‘AP Inter Exam Results 2026’ మీద క్లిక్ చేస్తే మీ రిజల్ట్ ఫోన్ లోనే చూసుకోవచ్చు.

అందరికీ మంచి మార్కులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్!

Leave a Comment